About

ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ & వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

ఈ అసోసియేషన్ రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ & వీడియోగ్రాఫర్స్ సమస్యల నుండి ఆవిర్భవించింది

ఫోటోగ్రాఫర్స్ & వీడియోగ్రాఫర్స్ సమస్యలఫై నిరంతరం స్పందించి పోరాడే ఈ అసోసియేషన్ మన అందరిది.

2003 సంవత్సరం రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్స్ & ఫోటోస్టూడియోల వారిఫై సర్వీస్ టాక్స్  అధికారుల వేదింపులకు విసిగి, వేసారి మన నిరసనను రాష్ట్రంలోని అనేక పట్టణాలలో బంద్ లు, రాస్తారోకోలు చేసి సాధారణ శాసన సభ్యుల నుండి దేశ రాష్ట్రపతి, ప్రధానుల వరకు దిన పత్రికాలతో మన నిరసన వ్యక్తీకరించి 32మంది బృందంతో ఎముకలు కొరికే (డిసెంబర్) చలిలో దేశ రాజధాని ఢిల్లీలో 15 రోజుల ఫైన మన బాధను నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి స్పష్టమైన హామీపొంది 28.02.2005 బడ్జెట్ సమావేశంలో చట్ట సవరణ చేపించిన ఘనత మన అసోసియేషన్ దే.

2006లో కొత్తగా వచ్చిన డిజిటల్ టెక్నాలజీతో విచ్చలవిడిగా పబ్లిసిటీతో రాష్టంలో ఫోటోగ్రాఫర్ల ఉనికే లేకుండా చేయాలని చూసిన కొన్ని ప్రధాననగరాలలో ఈ మన నాయకులే వాళ్ళతో మాట్లాడి, పోట్లాడి పాస్ పోర్ట్ ఫోటోలను మరల బ్రతికించింది ఈ మన అసోసియేషన్

ఇటువంటి సమస్యలఫై స్పందించడానికి 2008లో ఈ అసోసియేషన్ ని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది కాని ఈ అసోసియేషన్ ఆడంబరాలకు పోదు. రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ & వీడియోగ్రాఫర్స్ వల్లే తమ అభివృద్దికి కట్టుబడి నిరంతరం ప్రతిక్షణం పని చేస్తుంది.

ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు వర్క్ షాప్ కి ఒక సాధారణ ఫోటోగ్రాఫర్ లేని పరిస్థితి ఉండేది. ఇది గమనించిన మన అసోసియేషన్  రాష్ట్ర వ్యాప్తంగా 55 ఉచిత వర్క్ షాప్ లను నిర్వహించి ఫోటోగ్రాఫర్స్ అభ్యున్నతికి కృషి చేస్తుంది.

ఈ రోజున ప్రతి పట్టణాలలో వర్క్ షాప్ లు జరుగుతున్నాయంటే కారణం APPVWA అని సగర్వంగా చెప్పుకోవచ్చు.

ఫోటోగ్రాఫర్స్ & వీడియోగ్రాఫర్స్ మరియు అనుబంధ శాఖల అభివృద్ధికి నిరంతరం వృత్తి పరిరక్షణకు కట్టుపడి మనల్ని ముందుకు నడిపిస్తుంది.

APPVWA సంఖ్యా బలం కన్నా… మాకు సంకల్పం ముఖ్యం